Site icon NTV Telugu

Vishal : సూపర్‌గుడ్ ఫిల్మ్స్ నుంచి విశాల్ పవర్‌ఫుల్ ప్రాజెక్ట్..

Vishal 35th Movie,

Vishal 35th Movie,

తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ తాజాగా తన 35వ సినిమాను ప్రారంభించారు. ఈ చిత్రం మరో విశేషతను సొంతం చేసుకుంది సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థకు ఇది 99వ చిత్రం. ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించిన ఈ బ్యానర్‌కి ఇది మైలురాయి సినిమాగా నిలవబోతుంది. ఈ చిత్రం చెన్నైలో సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.  కాగా ఈ చిత్ర ప్రారంభోత్సవానికి స్టార్ నటులు కీర్తి, జీవ, దర్శకుడు వెట్రిమారన్, శరవణ సుబ్బయ్య, మణిమారన్, వెంకట్ మోహన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.

Also  Read : Pooja Hegde : పూజా హెగ్డేకు బిగ్ ఛాన్స్ – టాలీవుడ్‌లో గ్రాండ్ రీ ఎంట్రీ ఖాయం

దుషార విజయన్ కథానాయికగా ఎంపిక కాగా, రవి అరసు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. విశాల్ సినిమాలు అంటేనే యాక్షన్, సామాజిక సందేశాలు, కమర్షియల్ హంగులతో కూడిన కథాంశాల సమ్మేళనం. ‘పందెం కోడి’, ‘పోగారి’, ‘తూపాకి మునై’, ‘అభిమన్యుడు’ వంటి సినిమాలతో అతను తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించాడు. తాజాగా ఈ 35వ చిత్రం కోసం ఎంచుకున్న కథ విభిన్నంగా ఉండబోతుందన్న టాక్ ఇప్పటికే ఇండస్ట్రీలో వినిపిస్తోంది.  ఇది పరిశ్రమ ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని సూచిస్తుంది. ప్రస్తుతం సినిమా టైటిల్ ఇంకా వెల్లడించలేదు. కానీ త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ వంటి అప్డేట్లు రానున్నాయని చిత్ర యూనిట్ ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల కోసం కూడా ఈ చిత్రాన్ని ఒకే సమయంలో విడుదల చేయనున్నారు.

Exit mobile version