టాలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తాజా ట్రెండ్ అయిన థియేటర్ ముందు ‘పబ్లిక్ రివ్యూలు’ సినిమాల సక్సెస్‌పై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘రెడ్ ఫ్లవర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా, కొత్త సినిమాలు విడుదలైన తొలి మూడు రోజులు అయినా ప్రేక్షకుల అభిప్రాయాలను షూట్ చేయకుండా నిలిపివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read : S S Rajamouli: బాహుబలి, RRR కాదు.. నా కెరీర్ బెస్ట్ మూవీ అదే..
‘ఒక సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే థియేటర్ల ముందు యూట్యూబ్ రివ్యూలు పెరుగుతున్నాయి. వారి రివ్వూలు సినిమాను నెగటివ్‌గా ప్రెజెంట్ చేయడంతో ప్రేక్షకులు ఆసక్తి కోల్పోతున్నారు. ఈ పరిస్థితిని ఆపాలని, కనీసం సినిమాకు మొదటి 12 షోలు ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వండి. కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబర్లు ముందుగా సినిమాను పూర్తిగా చూశాకే తమ అభిప్రాయాన్ని తెలపాలి. వెంటనే రివ్యూలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల సినిమాల పై అన్యాయం జరుగుతోంది. దీని వల్ల ప్రేక్షకులకు అసలైన అనుభూతి కలగకముందే, ఒక అభిప్రాయాన్ని తగిలించడం అవుతుంది’ అంటూ ఆయన గట్టిగా తెలిపారు.
ఇటీవల తమిల్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ తరపున దాఖలైన, ఆన్‌లైన్ రివ్యూలపై 3 రోజుల నిషేధం కోరిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, పరిశ్రమలో ఈ అంశంపై చర్చలు కొనసాగుతున్న సమయంలో విశాల్ చేసిన ఈ కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
