Site icon NTV Telugu

Actor Vishal: ఆ సమస్యను రాజకీయం చేయడం ఆపేయండి.. మీ కాళ్ళు మొక్కుతా!

Vishal

Vishal

Actor Vishal: కోలీవుడ్ నటుడు విశాల్ ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే, ఇటీవల డైరెక్టర్ తో వివాదడం ఏర్పడగా.. ‘మకుటం’ చిత్రాన్ని విశాల్ సొంతంగా తెరకెక్కిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా అతడు నిత్యం యాక్టివ్‌గా కనిపిస్తాడు. అయితే, గత నెలలో కోయంబత్తూర్‌లో జరిగిన అత్యాచార ఘటనపై విశాల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ సంచలన పోస్ట్ పెట్టారు. ఆ సమయంలో బాధితురాలు ఆ ప్రదేశంలో ఉన్నందుకు ఆమెను నిందించడం దయచేసి ఆపండి.. మన దేశంలో పునరావృతమయ్యే ఈ రక్తసిక్తమైన అత్యాచారం అనే సమస్యను రాజకీయం చేయడం ఆపండి.. ఈ విషయంపై చర్చించకుండా ఉండేందుకు మీ కాళ్ళు మొక్కుతాను అని విశాల్ కోరారు.

Read Also: Janvi Ghattamaneni: హీరోయిన్ అవకుండానే యాడ్.. లక్షణంగా ఉంది బాసూ

అయితే, ఈ దారుణమైన నేరానికి ఉరిశిక్షను అమలు చేయండి అని హీరో విశాల్ కోరారు. నిర్భయ సంఘటన జరగడం చూశాం.. ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి, తన సొంత తల్లిని హత్య చేసిన ఆరోపణలపై సుదీర్ఘ విచారణ తర్వాత గత నెలలో ఒక నిందితుడు నిర్దోషిగా రిలీజ్ కావడం చూశాం.. ఇలాంటి ఘటనలు సౌదీ అరేబియాలో జరిగితే.. చింపేసేవారు కానీ, మన దేశంలో నిందితులు కూడా స్వేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నారని పేర్కొన్నారు. చాలా సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి నేరం జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నేను సెల్యూట్ చేస్తున్నాను అని విశాల్ తెలిపారు.

Exit mobile version