Site icon NTV Telugu

Bhairavam: ఓటీటీలోకి ‘భైరవం’.. ఎక్కడ చూడాలంటే?

Viarata

Viarata

ZEE5 తాజాగా తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్‌’తో అందరినీ ఆకట్టుకుంది. ZEE5 లోకి వచ్చిన వారం రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చూసి దూసుకుపోతోంది. ఈ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇక ఈ భారీ విజయం తరువాత ZEE5 సంస్థ మరో క్రేజీ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘భైరవం’ త్వరలోనే ZEE5లోకి రాబోతోందని ప్రకటించారు. ప్రస్తుతం ZEE5లో ‘విరాటపాలెం’ సిరీస్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. కెవి శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌ను కృష్ణ పోలూరు డైరెక్ట్ చేశారు.

Also Read:Minister Komatireddy: కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. హరీష్ రావు, కేటీఆర్ లెక్కలోకి రారు..

అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రముఖ పాత్రలు పోషించారు. 1980లలో ఆంధ్రప్రదేశ్‌లోని విరాటపాలెం అనే గ్రామంలో ప్రతి వధువు తన పెళ్లి రోజున చనిపోతుంటుంది. అదొక శాపం అని గ్రామస్థులు భయంతో వణికిపోతుంటారు. అలా దాదాపు ఓ పదేళ్ల పాటుగా గ్రామంలో వివాహాం అనేది జరగదు. భయం, మూఢనమ్మకాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండే ఆ ఊర్లోకి పోలీసు కానిస్టేబుల్ మీనా (అభిజ్ఞ వూతలూరు) వస్తుంది. శాపగ్రస్తమైన గ్రామంలోకి ప్రవేశించి అక్కడి ప్రజల్ని ప్రశ్నించడానికి ధైర్యం చేస్తుంది. ఆ ఊరి రహస్యాల్ని ఎలా తెలుసుకుంది? అది శాపమా? ఎవరైనా చేస్తున్న హత్యలా? అనే ఉత్కంఠ, థ్రిల్స్ కలిగించే అంశాలతో సిరీస్ సాగుతుంది. జూన్ 26న ప్రీమియర్ అయిన విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్ ప్రశంసలు అందుకుంటోంది.

Exit mobile version