Site icon NTV Telugu

Ott release : డైరెక్ట్ గా ఓటీటీ లోకి వీరాంజనేయులు విహార యాత్ర..స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? 

Untitled Design (10)

Untitled Design (10)

వీరాంజనేయులు విహార యాత్ర ఓటీటీ విడుదలకు రెడీ అయింది. ఓటీటీలో విడుదలయ్యే క్లీన్ ఫ్యామిలీ కామెడీ డ్రామాలను తెలుగు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. సీనియర్ నటీనటులు నటించిన ఇలాంటి ఎన్నో సినిమాలు మరియు మినీ వెబ్ సిరీస్‌లు ఇప్పటికే విజయవంతమయ్యాయి. సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహార యాత్ర’. కుటుంబ కామెడీ-డ్రామా నేపథ్యంలో రానున్న ఈ చిత్రాన్ని అనురాగ్ పాలుట్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఆగస్టు 14న విడుదల చేస్తున్నట్టు  ప్రకటించింది ఈటీవీ విన్ . ఈ సినిమా మోషన్ పోస్టర్ రీసెంట్ గా రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది.  ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా  తమ పర్యటనలో కనిపించకుండా పోయిన తన ‘బేబీ’ని కనుగొనమని కోరుతూ నరేష్ విచారకరమైన వీడియోను విడుదల చేస్తూ కల్కి 2898 AD చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్‌ని  ట్యాగ్ చేశాడు నరేష్.

వీరాంజనేయులు (వికె నరేష్) యొక్క కుటుంబం ఎల్లప్పుడూ ఒక సమస్యపై రకరకాల అభిప్రాయాలను కలిగిఉంటారు. కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఒక్క మాటపై  ఉండరు. ఇటువంటి వారంత కలిసి విహారయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. తమ పాత వ్యాన్‌ను అవసరమైన మరమ్మతులు మరియు కొత్త పెయింట్‌లతో తయారు చేస్తారు. వారు గోవాకు వెళ్లే సమయంలో ‘బేబీ’ యొక్క అస్థికలు ఉన్న కలశం కనిపించకుండా పోతుంది. ఆ తర్వాత ఏమి జరిగింది అనే నేపథ్యంలో రాబోతుంది ఈ చిత్రం. గతంలో ప్రియమణి నటించిన ‘భామాకలాపం’ చిత్రాన్ని నిర్మించిన బి బాపినీడు మరియు సుధీర్ ‘వీరాంజనేయులు విహార యాత్ర’ చిత్రాన్ని నిర్మించారు.

 

Also Read : Nihtin: ఒకేసారి రెండు సినిమాలు.. ఈ సారైనా హిట్టు దక్కేనా..?

Exit mobile version