Village Stars : పూజా కార్యక్రమాలతో మొదలైన ‘విలేజ్ స్టార్స్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో స్వచ్ఛమైన వినోదాన్ని పంచేందుకు సరికొత్త చిత్రం ‘విలేజ్ స్టార్స్’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. వెంకటగిరి వీరాంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన ఈ ముహూర్తపు వేడుకకు ప్రముఖ నటుడు సమీర్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఏ. నరేంద్ర హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఒడిశా భామ లిల్లీ బళ్ళు కథానాయికగా పరిచయమవుతున్నారు. నాగూర్ ఎన్జీఆర్ ఈ చిత్రానికి ఆసక్తికరమైన కథను అందించారు.
హీరో & దర్శకుడు నరేంద్ర మాట్లాడుతూ “చిన్న చిన్న ప్రాజెక్టులతో మా ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఇప్పుడు పూర్తి స్థాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ప్రేక్షకుల ఆశీస్సులు మా చిత్రానికి ఉండాలని కోరుకుంటున్నాను.” అన్నారు. హీరోయిన్ లిల్లీ బళ్ళు మాట్లాడుతూ “ఒడిశా నుంచి వచ్చిన నాకు తెలుగు తెరపై నటిగా అవకాశం ఇచ్చిన దర్శకుడు నరేంద్ర గారికి కృతజ్ఞతలు. ఈ చిత్రం నన్ను ప్రేక్షకులకు దగ్గర చేస్తుందని నమ్ముతున్నాను.” అని అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త సంపత్, నటుడు రాధాకృష్ణ తదితరులు పాల్గొని నూతన ప్రతిభను ప్రోత్సహించాలని కోరారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించుకోనుంది.
Also Read
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?