Site icon NTV Telugu

Santana Praptirasthu: నవంబర్ 14న ‘సంతాన ప్రాప్తిరస్తు

Chandini Chow

Chandini Chow

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న తాజా చిత్రం “సంతాన ప్రాప్తిరస్తు”. మధుర ఎంటర్ టైన్ మెంట్ మరియు నిర్వి ఆర్ట్స్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా, చిత్ర ప్రమోషన్లలో భాగంగా “తెలుసా నీ కోసమే” లిరికల్ సాంగ్‌ను తాజాగా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో విడుదల చేశారు.

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పాటను ఆవిష్కరించారు. “ఆయ్”, “సేవ్ ది టైగర్స్” వంటి సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టులకు పనిచేసిన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ ‘తెలుసా నీ కోసమే’ పాటకు బ్యూటిఫుల్ ట్యూన్ అందించారు. శ్రీమణి రాసిన ఆకట్టుకునే లిరిక్స్‌కు, అర్మాన్ మాలిక్ తన గాత్రంతో ప్రాణం పోశారు. ఈ పాట మనసుకు హత్తుకునేలా ఉందని చిత్రబృందం తెలిపింది.

Exit mobile version