కన్నడ స్టార్ కిచ్చ సుదీప్ హీరోగా పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’ సిద్ధమవుతోంది. సుదీప్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా నుంచి ఏప్రిల్ 15న సర్ప్రైజ్ ఉంటుందని మేకర్స్ ప్రకటించగా… టీజర్ విడుదలవుతుందని అంతా భావించారు. కానీ మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఆగష్టు 19న “విక్రాంత్ రోణ” ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, మలయాళంతో పాటు మరో ఐదు విదేశీ భాషల్లో, దాదాపు 50 దేశాల్లో భారీ రేంజ్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై సుదీప్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జాన్ మంజునాథ్, షాలిని మంజునాథ్ నిర్మిస్తున్నారు. బి. అజనీష్ లోక్ నాథ్ సంగీత సారథ్యం వహిస్తుండగా…. విలియం డేవిడ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
“విక్రాంత్ రోణ” రిలీజ్ డేట్ ఫిక్స్
