Site icon NTV Telugu

‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి!

నాలుగేళ్ళ క్రితం తమిళంలో రూపుదిద్దుకుని, కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న ‘విక్రమ వేద’ మూవీ ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది. తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి టైటిల్ రోల్ పోషించిన ఈ మూవీ హిందీ వెర్షన్ లో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. మాతృకను తెరకెక్కించిన పుష్కర్, గాయత్రి ద్వయం హిందీ రీమేక్ నూ డైరెక్ట్ చేస్తోంది. ఇటీవలే ఈ మూవీ తొలి షెడ్యూల్ ను అబు దబీ లో పూర్తిచేశారు. అక్కడ దాదాపు 27 రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. రెండో షెడ్యూల్ ను సైఫ్ అలీఖాన్ పై లక్నోలో ప్రారంభిస్తారు. ఈ మూవీని టీ సీరిస్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్, ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్ తో కలిసి వైనాట్ స్టూడియోస్ కు చెందిన ఎస్. శశికాంత్ నిర్మిస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే, హిందీ ‘విక్రమ్ వేద’ వచ్చే యేడాది సెప్టెంబర్ 30న విడుదలవుతుంది. ఈ చిత్రంలో రాధికా ఆప్టే ఓ కీలక పాత్రను పోషిస్తుండటం విశేషం.

Exit mobile version