Vikkatakavi : తెలుగు, తమిళ భాషల్లో ఓటీటీ లో రిలీజ్ కానున్న‘వికటకవి’
- నరేష్ అగస్త్య.. మేఘా ఆకాష్ లీడ్ రోల్ లో వస్తున్న వికటకవి
- తెలుగు.. తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్న ‘వికటకవి’
- ఈ నెల 28 నుండి ZEE5 లో స్ట్రీమింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైవిధ్యమైన కంటెంట్‌ను ఆస్వాదించాలనుకునే ప్రేక్షకులకు డిఫరెంట్ కథలను అందించడంలో ముందుంటోన్న వన్ అండ్ ఓన్లీ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5. ఈ మాధ్యమం నుంచి సరికొత్త వెబ్ సిరీస్ ‘వికటకవి’ త్వరలోనే ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ZEE5 ‘వికటకవి’ సిరీస్‌ను తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read : Allu Arjun : అల్లు అయాన్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..?
Also Read
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే కావటం విశేషం. కథ నేపథ్యం పరిశీలిస్తే హైదరాబాద్ విలీనం తర్వాత నల్లమల ప్రాంతంలోని ‘అమరగిరి’ అనే ప్రాంతాన్ని 30 ఏళ్లుగా ఓ శాపం పట్టి పీడిస్తుంటుంది. కొన్ని కారణాలతో అమరగిరి ప్రాంతంలోని సమస్యను గుర్తించటానికి డిటెక్టివ్ రామకృష్ణ ఆ ఊరు వెళతాడు. తన తెలివి తేటలతో ఆ గ్రామానికి సంబంధించిన పురాతన కథలను, అధునిక కుట్రల వెనుకున్న రహస్యాలను ఒక్కోటిగా వెలికితీస్తాడు. ఈ ప్రయాణంలో తనకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి? అమరిగిరి ప్రాంతంతో రామకృష్ణకు ఉన్న అనుబంధం ఏంటనేది తెలుసుకోవాలంటే ‘వికటకవి’ సిరీస్ చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. అజయ్ అరసాడ సంగీతాన్ని అందిస్తుండగా షోయబ్ సిద్ధికీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి కొద్దీ రోజుల్లో స్ట్రీమింగ్ కు రానున్న వికటకవిని వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుని ఫ్యామిలీతో కలిసి చూసేయండి.
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!