NTV Telugu Site icon

Vikkatakavi : తెలుగు, తమిళ భాషల్లో ఓటీటీ లో రిలీజ్ కానున్న‘వికటకవి’

Zee5

Zee5

వైవిధ్యమైన కంటెంట్‌ను ఆస్వాదించాల‌నుకునే ప్రేక్ష‌కుల‌కు డిఫ‌రెంట్ కథలను అందించడంలో ముందుంటోన్న వ‌న్ అండ్ ఓన్లీ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5. ఈ మాధ్య‌మం నుంచి సరికొత్త వెబ్ సిరీస్ ‘వికటకవి’ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి సిద్ధ‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ZEE5 ‘విక‌ట‌క‌వి’ సిరీస్‌ను తెలుగు, త‌మిళ భాష‌ల్లో న‌వంబ‌ర్ 28 నుంచి స్ట్రీమింగ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read : Allu Arjun : అల్లు అయాన్ ఫేవరెట్‌ హీరో ఎవరో తెలుసా..?

తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే కావటం విశేషం. కథ నేపథ్యం పరిశీలిస్తే హైదరాబాద్ విలీనం తర్వాత నల్లమల ప్రాంతంలోని ‘అమరగిరి’ అనే ప్రాంతాన్ని 30 ఏళ్లుగా ఓ శాపం పట్టి పీడిస్తుంటుంది. కొన్ని కార‌ణాల‌తో అమరగిరి ప్రాంతంలోని స‌మ‌స్య‌ను గుర్తించ‌టానికి డిటెక్టివ్ రామకృష్ణ ఆ ఊరు వెళతాడు. త‌న తెలివి తేట‌ల‌తో ఆ గ్రామానికి సంబంధించిన పురాతన కథలను, అధునిక కుట్రల వెనుకున్న రహస్యాలను  ఒక్కోటిగా వెలికితీస్తాడు. ఈ ప్రయాణంలో తనకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి? అమ‌రిగిరి ప్రాంతంతో రామ‌కృష్ణ‌కు ఉన్న అనుబంధం ఏంట‌నేది తెలుసుకోవాలంటే ‘వికటకవి’ సిరీస్ చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్. అజయ్ అరసాడ సంగీతాన్ని అందిస్తుండగా షోయబ్ సిద్ధికీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి కొద్దీ రోజుల్లో స్ట్రీమింగ్ కు రానున్న వికటకవిని వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుని ఫ్యామిలీతో కలిసి చూసేయండి.

Show comments