JanaNayagan : జననాయగన్ ఓటీటీ రైట్స్ అమెజాన్ రీ-ఎంట్రీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సూపర్ స్టార్ విజయ్ తన సినీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’. ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నప్పటికీ సెన్సార్ సమస్యల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. దాంతో ఈ సినిమా ఓటీటీ రైట్స్ డీల్ కూడా క్యాన్సిల్ అయింది. వాస్తవానికి ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే ప్రకటించిన తేదీకి సినిమా విడుదల కాకపోవడంతో ఈ డీల్ రద్దయింది.
కానీ తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ‘జననాయగన్’ ప్రాజెక్టుకు ఒక్కసారిగా గ్లోబల్ స్థాయిలో హైప్ పెరిగింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆఖరి సినిమా కావడంతో దీని డిజిటల్ రైట్స్ కోసం మళ్ళీ పోటీ మొదలైంది. ఈ నేపథ్యంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో మరోసారి కేవీఎన్ ప్రొడక్షన్స్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. విజయ్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు భారీ ఆఫర్‌ను మేకర్స్ ముందు ఉంచినట్లు ట్రేడ్ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. చాలా కాలంగా సెన్సార్ బోర్డు వద్ద పెండింగ్‌లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే లైన్ క్లియర్ చేసుకుని థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓటీటీ డీల్ కుదిరిన తర్వాత అధికారిక విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ‘జననాయగన్’ చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!