Site icon NTV Telugu

Vijayashanti: వారికి విజయశాంతి స్ట్రాంగ్ వార్నింగ్

Vijayashanthi

Vijayashanthi

విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లి-కొడుకులుగా నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఏప్రిల్ 18, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించింది. రివ్యూలు కొంత మిశ్రమంగా వచ్చినప్పటికీ, కలెక్షన్స్ విషయంలో మాత్రం సినిమా బాగానే రాణిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా విజయశాంతి చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ విజయశాంతి, ఈ సినిమాను నెగిటివ్‌గా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆమె మాటల్లో, “ఈ సినిమాను నెగిటివ్ చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అది వారి సంస్కారం. ఆ విషయంలో మనం చేయగలిగింది ఏమీ లేదు. దాన్ని శాడిజం అంటారో, ఇంకేమంటారో నాకు తెలియదు. సినిమాని ఖూనీ చేయాలని కొంతమంది దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నారు వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను. దయచేసి ఆపండి, ఇక ఇది మంచి పద్ధతి కాదు. ఏ రూపంలో అయినా మీరు వస్తున్నారు సినిమాని డిస్టర్బ్ చేస్తున్నారు. థియేటర్ కి వెళ్తే జనం అద్భుతంగా ఉందని పాజిటివ్గా చెబుతున్నారు కానీ మీరు మాత్రం ఒక పైసాచిక ఆనందం తీసుకోవద్దు. నీకు ఎవరైనా మైండ్ వాష్ చేస్తూ ఎక్కిస్తూ ఉంటే వాళ్ల దగ్గరికి వెళ్లి చెంచా కొట్టుకుంటూ కూర్చోండి కానీ సినిమాని నాశనం చేయాలని చూడొద్దు. ”

Vijayashanti: వారికి విజయశాంతి స్ట్రాంగ్ వార్నింగ్

ఏ సినిమా కైనా కోట్లు ఖర్చుపెట్టి తీస్తున్న నిర్మాతలకు కష్టపడుతున్న టెక్నీషియన్లు నటీనటులకు అసౌకర్యం కలిగించడమే అవుతుంది కదా. సినిమాని ఇబ్బంది పెట్టడమే అవుతుంది కదా. నిజానికి ప్రతి ఒక్కరిని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కావాలని కొందరు చేస్తున్నారు నేను చూస్తున్నాను, వింటున్నాను. ఏ సినిమా అయినా ఏ హీరో సినిమా అయినా ఇది మంచి పద్ధతి మాత్రం కాదు. ఈ రకంగా నెగిటివ్గా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్క సినిమా ఆడాలని మేము కోరుకుంటాం. బాగున్నా సినిమా అని బాలేదని బాలేని సినిమాని బాగుందని చెప్పడం ఏంటిది? అలా చేయడం వల్ల కొన్ని జీవితాలు పోతాయి. మేమంటే ఇప్పటికే సెటిల్ అయిపోయి ఉన్న ఆర్టిస్టులం. అన్ని చూసి వచ్చేసాం కానీ ఇప్పుడున్న జనరేషన్ హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఎన్ని ఆశలు పెట్టుకొని సినీ పరిశ్రమకు వస్తారు. నిర్మాతలు, దర్శకులు కొన్ని కోట్లు ఖర్చుపెట్టి సినిమా చేస్తే దాన్ని నాశనం చేస్తామని చూస్తున్నారే మిమ్మల్ని మాత్రం జీవితంలో క్షమించను. దయచేసి కొంచెం కంట్రోల్ గా ఉండండి. ఈ చీప్ పనులన్నీ మానుకోండి. సినిమా ఇండస్ట్రీని బతికించండి అందరు దర్శకులు, హీరోలు, నిర్మాతలు బాగుండాలని కోరుకుంటున్నాను అంటూ ఆమె మాట్లాడారు.

Exit mobile version