vijayantony : ‘గగన మార్గన్’ గా వస్తోన్న బిచ్చగాడు
- వరుస సినిమాలలో నటిస్తున్న విజయ్ ఆంటోనీ
- బిచ్చగాడు సిరీస్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన విజయ్
- ప్రముఖ ఎడిటర్ కు దర్శకుడిగా బాధ్యతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడిగా, దర్శకుడిగా, లిరిసిస్ట్‌గా, సంగీత దర్శకుడిగా తన సత్తాను చాటుకున్నారు విజయ్ ఆంటోని. మల్టీ టాలెంటెడ్ అయిన విజయ్ ఆంటోనీ డిటెక్టివ్ ఫిక్షన్ ప్రపంచంలోకి అందరినీ తీసుకెళ్లేందుకు గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్నారు. విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని సగర్వంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ టైటిల్‌ను తాజాగా రివీల్ చేశారు. ‘గగన మార్గన్’ అంటూ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ ఆంటోని రెండు రకాలుగా కనిపించారు. గాయపడి ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన విజయ్ లుక్ కొత్తగా ఉంటే.. నీటి అడుగు బాగాన ఉన్న వ్యక్తి పోస్టర్ కూడా ఇందులో కనిపిస్తోంది.
“అట్టకత్తి”, “బీడ”, “సూదు కవ్వుం”, “ఇంద్రు నేత్ర నాళై”, “తేకడి”, “ముండాసుపట్టి”, “కదలుం కాదందు పోగుం”, “ఏ1”, “మాయవన్” వంటి చిత్రాలకు ఎడిటర్‌గా పేరు తెచ్చుకున్న లియో జాన్ పాల్.. ‘గగన మార్గన్’తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. లియో జాన్ పాల్ 2013లో “ఇదర్‌కుతానే ఆసైపట్టై బాలకుమార” చిత్రానికి ఉత్తమ ఎడిటర్‌గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. ఈ చిత్రంలో సముద్రఖని, మహానది శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ వంటి వారు నటించారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
యువ ఎస్ సినిమాటోగ్రాఫర్‌గా, రాజా ఆర్ట్ డైరెక్టర్‌గా, విజయ్ ఆంటోని మ్యూజిక్ కంపోజర్‌గా పని చేశారు. ముఖ్యంగా ఈ చిత్రానికి ముంబైలో చిత్రీకరించిన నీటి అడుగున సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి.‘గగన మార్గన్’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : OG : ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’ షూట్ లో అడుగుపెట్టేది ఎప్పుడంటే..
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?