NTV Telugu Site icon

Darshan Wife: నాకు, నా కొడుక్కి ఎలాంటి ఇబ్బంది రావొద్దు.. కమిషనర్‌కు దర్శన్ భార్య లేఖ!

Darshan

Darshan

Vijayalakshmi Darshan Writes Letter To Police Commissioner:రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ ప్రమేయం ఉండడంతో ఈ కేసులో రెండో నిందితుడు దర్శన్ పరప్పన అగ్రహార జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నాడు. దర్శన్ గర్ల్ ఫ్రెండ్ మొదటి నిందితురాలు అయిన పవిత్ర గౌడ కూడా జ్యుడీషియల్ కస్టడీలో ఉంది. అయితే దర్శన్‌ను జైలు నుంచి బయటకు తీసుకురావడానికి భార్య విజయలక్ష్మి కష్టపడుతోంది. ఆ సమయంలో విజయలక్ష్మి దర్శన్ పోలీస్ కమిషనర్ దయానంద్ కు ‘నేను దర్శన్ ఏకైక భార్యను’ అంటూ లేఖ రాసింది. రేణుకా స్వామి హత్యకేసులో దర్శన్, ఇతర నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం పోలీస్ కమిషనర్ దయానంద్ ప్రెస్ మీట్ ద్వారా మీడియాకు సమాచారం అందించారు. ఈ సమయంలో పవిత్ర గౌడను పోలీస్ కమిషనర్ ‘దర్శన్ భార్య’ అని సంబోధించారు. ఇదే అంశంపై క్లారిటీ ఇస్తూ విజయలక్ష్మి దర్శన్ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. ‘‘దర్శన్‌కి నేను ఒక్కతే భార్యను.

SSMB 29 : ఏంటి సార్ ఇదీ.. వంట పాత్రలకు 20 లక్షల ఖర్చా?

పవిత్ర గౌడ స్నేహితురాలని లేఖ ద్వారా విజయలక్ష్మి తెలిపారు. అదేవిధంగా విజయలక్ష్మి దర్శన్ పత్రాల్లో సరైన సమాచారాన్ని పేర్కొనాలని పోలీసు కమిషనర్‌ను అభ్యర్థించారు. రేణుకాస్వామి హత్య కేసులో మీ డిపార్ట్‌మెంట్ నా భర్త దర్శన్‌తో పాటు మరికొందరిని అరెస్ట్ చేసి రెండు వారాలైంది. మన న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. చట్టం తన దారి తాను తీసుకుంటుందని నేను నమ్ముతున్నాను. అయితే, ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ఏ-1 శ్రీమతి పవిత్ర గౌడ గురించి సరైన సమాచారాన్ని రికార్డుల్లో పేర్కొనవలసిందిగా కోరుతున్నాను. పవిత్ర గౌడ నా భర్త శ్రీ దర్శన్ శ్రీనివాస్‌కి స్నేహితురాలు. మీరు భార్య కాదని దయచేసి గమనించండి. దర్శన్ కి నేను ఒక్కతే భార్యను.

చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న భార్యను నేను మాత్రమే. మా వివాహం 19.05.2003న ధర్మస్థలంలో జరిగింది. మీడియాను ఉద్దేశించి మీరు పవిత్ర గౌడను దర్శన్ భార్య అని తప్పుగా సంబోధించారు. ఆ తర్వాత రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్, ఆయన భార్య అరెస్టయ్యారనే వార్తలను జాతీయ మీడియా ప్రచురించింది. నేను దర్శన్ యొక్క ఏకైక భార్యను. ఈ తప్పుడు సమాచారం వలన భవిష్యత్తులో నాకు, కొడుకు వినీష్‌కి ఈ కేసు ఎలాంటి గందరగోళం, ఇబ్బంది కలిగించకూడదు. శ్రీమతి పవిత్ర గౌడ శ్రీ సంజయ్ సింగ్‌ను వివాహం చేసుకున్నారని చెబుతున్నారు. పవిత్ర గౌడకు సంజయ్ సింగ్‌కు ఒక కుమార్తె ఉంది. కావున దీనికి సంబంధించి మీ పోలీసు ఫైళ్లలోని రికార్డులు, సమాచారాన్ని సరిచేయవలసిందిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. పవిత్ర గౌడను భార్యగా తప్పుగా పేర్కొన్నందున చట్టపరమైన సహా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అని ఆమె లేఖలో పేర్కొంది.