NTV Telugu Site icon

Vijay: G.O.A.T సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్న స్టార్ క్రికెటర్..?

Untitled Design (18)

Untitled Design (18)

తమిళ స్టార్ హీరో విజయ్ లేటెస్ట్ సినిమా ది గోట్‌ ’(ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. విజయ్ సరసన మీనాక్షి చౌదరీ హీరోయిన్ గా కనిపిస్తుండగా స్నేహ, లైలా, మాళవిక శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల రిలీజ్ అయిన చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. సెప్టెంబరు 5 న రిలీజ్ అవుతోంది ఈ పాన్ ఇండియా సినిమా.

Also Read: Ananya Panday : లైగర్ బ్యూటీ ఓటీటీ డెబ్యూ.. వెబ్ సిరీస్ లో నటిస్తున్న అనన్య

కాగా, ఈ సినిమాలో సీఎస్‌కే మాజీ క్రికెటర్ బద్రినాథ్‌ ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ విషయాన్నీక్రికెటర్ బద్రినాథ్‌ తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీనికి సంబంధించి తన వ్యక్తిగత ‘X’ ఖాతలో ఓ పోస్ట్‌ పెట్టారు. ది గోట్ లో తన పాత్రకు డబ్బింగ్‌ చెబుతున్న ఫొటోను షేర్ చేశాడు బద్రీనాధ్. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పిన బద్రీనాధ్ ఇప్పుడు వెండితెరపై ‘తొలిసారి మెరవనున్నాడు. ‘ది గోట్‌’ కోసం నావంతు కృషి చేశాను. ఇందులో భాగమైనందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. నా నటనపై మీ రివ్యూ, సలహాల కోసం ఎదురుచూస్తున్నా’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు దర్శకుడు స్పందిస్తూ, ఈ సినిమాను ఓకే చేసినందుకుగానూ బద్రినాథ్‌కు థ్యాంక్స్‌ చెప్పాడు దర్శకుడు వెంకట్‌ప్రభు, బద్రినాధ్  అద్భుతంగా నటించావని బద్రీనాధ్ కు కితాబునిచ్చాడు దర్శకుడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ విడుదల చేస్తోంది.

 

Show comments