NTV Telugu Site icon

ట్విట్టర్ స్పేస్ లో విజయ్ ఫ్యాన్స్ నయా రికార్డ్!

థియేటర్ల కలెక్షన్ల స్థానంలో ఇప్పుడు సోషల్ మీడియా రికార్డులు వచ్చి చేరాయి. లైక్స్, షేర్స్, ఫాలోవర్స్… సంఖ్యను ప్రదర్శిస్తూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎవరైనా స్టార్ హీరో బర్త్ డే వస్తే… కామన్ డీపీ కి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని షేర్స్ వచ్చాయి అనేది చూడటం ఎక్కువైపోయింది. అలానే ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్ వీడియోస్ విడుదలైనప్పుడూ ఇదే తతంగం. తాజాగా విజయ్ ఫ్యాన్స్ అతని బర్త్ డే సందర్భంగా ఓ నయా రికార్డ్ ను ట్విట్టర్ స్పేస్ లో క్రియేట్ చేశారు. తమిళ సినీ అభిమానుల దళపతి విజయ్ బర్త్ డే రోజున కొత్త సినిమా పేరును ‘బీస్ట్’గా ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇదే సందర్భంగా విజయ్ అభిమానులు సెలబ్రేట్ దళపతి విత్ రూట్ ట్యాగ్ లైన్ తో ట్విట్టర్ స్పేస్ లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఏకంగా 27, 971 మంది శ్రోతలు పాల్గొన్నారు. ‘బీస్ట్’ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో పాటు, హీరోయిన్లు కీర్తి సురేశ్, మాళవిక మోహనన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ తదితరులు పాల్గొని విజయ్ తో తమకున్న అనుబంధాన్ని అభిమానులకు తెలియచేశారు. అలానే తమిళ సినిమా జర్నలిస్టులు, పి.ఆర్.ఓ. కూడా పెద్ద సంఖ్యలో ఈ ట్విటర్ స్పేస్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. విశేషం ఏమంటే… ఇండియాకు సంబంధించినంత వరకూ ఇంతమంది ట్విట్టర్ స్పేస్ షోలో పాల్గొనడం అనేది ఓ రికార్డ్. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ట్విట్టర్ స్పేస్ లో అత్యధికంగా థాయ్ ర్యాపర్ బామ్ బామ్ కార్యక్రమంలో 44, 208 మంది శ్రోతలు పాల్గొన్నారు. సో ఆ కార్యక్రమం ప్రథమస్థానంలో నిలువగా, విజయ్ ఫ్యాన్స్ ది రెండో స్థానం దక్కించుకుంది.