NTV Telugu Site icon

Gilli Re- Release : కళ్లు చెదిరే కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విజయ్ “గిల్లి” మూవీ..

Whatsapp Image 2024 04 23 At 7.13.19 Pm

Whatsapp Image 2024 04 23 At 7.13.19 Pm

టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది .స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి బ్లాక్ బస్టర్ మూవీస్ ను మరోసారి రిలీజ్ చేసి ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు .అయితే టాలీవుడ్ లో ఇప్పటికే చాలా సినిమాలు రీరిలీజ్ అయ్యాయి .తాజాగా ఈ ట్రెండ్ కోలీవుడ్ లో కూడా మొదలైంది .కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి,స్టార్ హీరోయిన్ త్రిష జంటగా నటించిన ‘గిల్లి’ సినిమా 2004 లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన ఒక్కడు సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.మహేష్ ,భూమిక జంటగా నటించిన ”ఒక్కడు” మూవీ తెలుగులో సూపర్ హిట్ అయింది. తెలుగులో విజయం సాధించడంతో తమిళ్ లో విజయ్ హీరోగా ”గిల్లి” పేరుతో రీమేక్ అయి అక్కడ కూడా సూపర్ హిట్ అయింది .

అయితే మూడు రోజుల క్రితం గిల్లి మూవీ మరోసారి రీ రిలీజ్ అయింది.రీరిలీజ్ అయిన ”గిల్లి” మూవీ అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఏకంగా రూ.10 కోట్ల కలెక్షన్స్ తో రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్నప్పటికీ ప్రేక్షకులు మొదటి రోజు మాత్రమే థియేటర్లకి వెళ్తున్నారు. అయితే, ‘గిల్లి’ సినిమాకి మాత్రం వరుసగా మూడు రోజులు భారీగా కలెక్షన్లు వచ్చాయి. రీరిలీజ్ కలెక్షన్స్ లో విజయ్ గిల్లి మూవీ రికార్డు సృష్టిస్తుంది .దేశవ్యాప్తంగా పదికోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి టైటానిక్, అవతార్ వంటి సినిమాల రీ రిలీజ్ కలెక్షన్స్ జాబితాలో చేరిపోయింది.గిల్లి జోరు ఇలాగే కొనసాగితే కలెక్షన్స్ హోరు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం .

Show comments