విజయ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘జననాయగన్ ’. హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తెలుగులో ఈ సినిమాను జననాయకుడుగా తీసుకువస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు వెర్షన్‌లో వరల్డ్ వైడ్ గా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సిఉంది. అందుకుసంబందించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. కేవలం అడ్వాన్స్ సేల్స్ లోనే రూ. 20 కోట్ల మార్క్ కూడా అందుకుంది.
ఇక రిలీజ్ కు మరికొన్ని గంటల సమయం ఉండగా జననాయగన్ రిలీజ్ వాయిదా పడింది. దాంతో ఒక్కసారిగా విజయ్ ఫ్యాన్స్ కు భారీ షాక్ తగిలినట్లయింది. ఒకవైపు థియేటర్స్ ను విజయ్ కటౌట్స్, బ్యానర్స్ తో నింపేశారు ఫ్యాన్స్. వారి అంచనాలపై నీళ్లు చెల్లేసింది సెన్సార్ టీమ్. సెన్సార్ బోర్డ్ నుంచి సర్టిఫికెట్ రాలేదు. సినిమాలో దాదాపు 32 కు పైగా అభ్యంతరాలు తెలిపింది సెన్సార్ టీమ్. అందుకు ఒప్పుకొని మేకర్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే చెన్నై కోర్టు జనవరి 9న తుది ఉత్తర్వులు రానున్న దృష్ట్యా ఈ గందరగోళం మధ్య సినిమా రిలీజ్ చేయడం రిస్క్ అని తెలిసి వాయిదా వేశారు మేకర్స్. దాంతో సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు నిర్ణయం తీసుకుని అఫీషియల్ గా ప్రకటించింది చిత్రబృందం. తదుపరి తేదీని త్వరలోనే వెల్లడించనున్నట్టు KVN ప్రొడక్షన్ సంస్థ తెలిపింది.
