Jana Nayakudu: తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో జోసెఫ్ విజయ్ హీరోగా నటిస్తున్న ‘జన నాయకుడు’ సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన కొత్త పోస్టర్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. వినోద్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ ఉండగా, తాజాగా విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కొత్త పోస్టర్‌లో విజయ్ పోలీస్ యూనిఫామ్‌లో స్టైలిష్‌గా కనిపిస్తూ చేతిలో కత్తిని పట్టుకుని కనిపించారు. విజయ్ లుక్, బాడీ లాంగ్వేజ్, మాస్ ప్రెజెన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. పోస్టర్‌ను బట్టి సినిమాలో యాక్షన్, ఎమోషన్, రాజకీయ అంశాలు కీలకంగా ఉండబోతున్నాయనే చర్చ సాగుతోంది. ఈ చిత్రం ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే జూలై 23న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఈ చిత్రానికి వినోద్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ భారీ చిత్రాన్ని వెంకట్ కె.నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్దే, మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచగా, తాజా పోస్టర్ ఆ ఆసక్తిని మరో స్థాయికి తీసుకెళ్లారు మేకర్స్. ఇక ఈ పోస్టర్‌లో “ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు జోసెఫ్ విజయ్” అనే ట్యాగ్‌లైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిజ జీవితంలో రాజకీయాల్లో అడుగుపెట్టిన విజయ్‌కు ఇది చివరి సినిమా కావచ్చనే ప్రచారం కూడా అభిమానుల్లో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తిని పెంచుతోంది. దీంతో ‘జన నాయకుడు’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జూలై 23న ‘జన నాయకుడు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తుండగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

