Site icon NTV Telugu

Kingdom : వాయిదాలకు గుడ్‌బై.. ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Kingdom Release Date

Kingdom Release Date

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘కింగ్డమ్’. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి  తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ ఇంటెన్స్ యాక్షన్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటి  వరకు విడుదలైన పోస్టర్స్‌, గ్లింప్సెస్ చూసిన ప్రతి ఒక్కరికీ ఆయనలో కొత్త యాంగిల్ కనిపిస్తోంది. ఈ పాత్ర కోసం విజయ్ భారీగా ట్రాన్స్‌ఫర్మ్ అయినట్టు సమాచారం. అతని పెర్ఫార్మెన్స్ ఈసారి మరో లెవెల్‌లో ఉండనుందట. ఇక భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా.. ఇటీవల వరుస వాయిదాలు తీసుకుంటూ వచ్చిన ‘కింగ్డమ్’, ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది.

Also Read : Vijay Sethupathi: సూర్య కారణంగా.. క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి

తాజాగా మేకర్స్ ఒక ఆసక్తికరమైన అప్డేట్‌ను వెల్లడించారు. ఈ ప్రెస్టీజియస్ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ప్రోమోను నేడు సాయంత్రం 7.03 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.  ఇప్పటికే రిలీజ్ వాయిదాల కారణంగా నిరాశ చెందిన ఫ్యాన్స్ ఇప్పుడు ఊపిరి పీల్చు కుంటున్నారు.  మొత్తనికి   ‘కింగ్డమ్’ మూవీ, ఇప్పుడు దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. అభిమానులకూ, బాక్సాఫీస్‌కి ఇది మంచి ఉత్సాహం కలిగించే సినిమా కావొచ్చని ఇండస్ట్రీలో జోరుగా చర్చ సాగుతోంది. మరి రౌడీ స్టార్ ఈసారి బ్లాక్‌బస్టర్‌తో రీటర్న్ ఇస్తాడా? అన్నది తెలియాలంటే రిలీజ్ డేట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version