Site icon NTV Telugu

Vijay : క్లాసిక్ హిట్ సినిమాను రిజెక్ట్ చేసిన విజయ్ దేవరకొండ

Vijaydevarakonda

Vijaydevarakonda

అక్కినేని సుమంత్ హీరోగా ఆకాంక్ష సింగ్ ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటించిన చిత్రం మళ్ళీ రావా.  2017 లో వచ్చిన ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఆకాంక్ష సింగ్ ఈ చిత్రంతో తెలుగు సినిమాకు ఎంట్రీ ఇచ్చింది. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిచిన ఈ  సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. వరుస ఫ్లోప్స్ తో సతమతమవుతున్న సుమంత్ మళ్ళి రావాతో సూపర్ హిట్ అందుకున్నాడు. మనసును హత్తుకునే క్లీన్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది.

Also Read : MIRAI : తేజ సజ్జా ‘మిరాయ్’కు బాలీవుడ్ నిర్మాత భారీ డీల్

అయితే ఈ సినిమాలో మొదట అనుకున్న హీరో అక్కినేని సుమంత్ కాదట. ఈ విషయాన్ని స్వయంగా ఈ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెలిపాడు.  ఈ దర్శకుడి లేటెస్ట్ చిత్రం కింగ్డమ్ ప్రమోషన్స్ లో ఈ విషయాన్ని తెలియజేసాడు. గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ’ పెళ్లి చూపులు రిలీజ్ రోజు మళ్ళీ రావా’ కథ  విజయ్ కు కథ చెప్తే సమోసాలు పెడితె తినినువ్వు చెప్పే కథ నాకేమి ఎక్కట్లేదు. ఈ సినిమా వద్దులే అని చెప్పి వెళ్ళాడు. దాంతో అక్కినేని సుమంత్ తో ఆ సినిమా చేయడం హిట్ అవడం జరిగింది’ అని అన్నాడు. అలా తన కెరీర్ లో గుర్తుండిపోయే ఒక క్లాసిక్ లవ్ స్టోరీ సినిమాను విజయ్ దేవరకొండ వదులుకున్నాడు. ఇలా సుమంత్ కెరీర్ లో క్లాసిక్ హిట్ అందుకున్నాడు. అప్పుడు సెట్ అవని ఈ ఇద్దరి కాంబో దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత కింగ్డమ్ రూపంలో ఈ నెల 31న ఆడియెన్స్ ముందుకు వస్తోంది.

Exit mobile version