Vijay Deverakonda and Vikram K Kumar Movie: టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొంతకాలంగా మాస్ యాక్షన్ సినిమాలపై దృష్టి పెట్టారు. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి చిత్రాలతో లవర్ బాయ్‌గా, యూత్‌కు దగ్గరైన హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. ఆ తర్వాత వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఇటీవల ఆయన సినిమాల్లో హింస, యాక్షన్‌కు ప్రాధాన్యం పెరగడంతో.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యే కథల్లోనూ నటించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. ఆ దిశగా రౌడీ హీరో కూడా ప్లాన్ చేస్తున్నారు.
అర్జున్ రెడ్డితో తనలోని ఇంటెన్స్ నటుడిని పరిచయం చేసిన విజయ్ దేవరకొండ.. గీత గోవిందంతో ప్రేమకథల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకోగలనని నిరూపించారు. ఈ రెండు సినిమాలు ఆయన కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ముఖ్యంగా ఫీల్‌గుడ్ ప్రేమకథల్లో విజయ్‌ను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. ఆ తర్వాత మాత్రం ఆయన కథల ఎంపికలో కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తూ యాక్షన్, మాస్ పాత్రల వైపు అడుగులు వేశారు. ‘కింగ్‌డమ్’, ‘రణబాలి’ వంటి చిత్రాలతో పాటు రాబోయే ‘రౌడీ జనార్ధన’, శౌర్యవ్‌తో చేయనున్న సినిమా వంటి ప్రాజెక్టుల్లోనూ యాక్షన్ అంశాలు ఉండనున్నాయి.
అయితే విజయ్ దేవరకొండ కేవలం మాస్, యాక్షన్ చిత్రాలకే పరిమితం కావాలని అనుకోవడం లేదట. విభిన్నమైన పాత్రలు, కథలను ఎంచుకుంటూనే తనకు గుర్తింపు తెచ్చిన ప్రేమకథలు, కుటుంబ ప్రేక్షకులకు నచ్చే సినిమాల వైపు కూడా దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు విక్రమ్ కె. కుమార్‌తో విజయ్ ఓ ఫీల్‌గుడ్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే విజయ్ నుంచి మరో మంచి ప్రేమకథ లేదా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా వస్తుందనే ఆశలు అభిమానుల్లో మొదలయ్యాయి.
ఇటీవల తెలుగు ప్రేక్షకుల్లో కుటుంబ సమేతంగా చూడగలిగే కథలు, భావోద్వేగాలకు ప్రాధాన్యమున్న సినిమాలపై ఆసక్తి పెరిగింది. దీంతో పలువురు టాప్ హీరోలు కూడా విభిన్న జానర్లతో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లపై దృష్టి పెడుతున్నారు. విజయ్ దేవరకొండ కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారు. మాస్ యాక్షన్‌తో కొత్త ప్రయోగాలు చేస్తున్న విజయ్.. తనలోని రొమాంటిక్ హీరోను మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేయాలని చూస్తున్నారు. విక్రమ్ కె. కుమార్‌తో తెరకెక్కనున్న సినిమా ఓ అందమైన ప్రేమకథ అని తెలుస్తోంది. ఇష్క్, మనం, గ్యాంగ్ లీడర్, థాంక్యూ వంటి హిట్ సినిమాలను విక్రమ్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన దూత 2తో బిజీగా ఉన్నారు.

