NTV Telugu Site icon

Vijay Deverakonda: రష్మికతో నటించిన సినిమాలో విజయ్ తల్లి కూడా నటించిందని తెలుసా?

Vijay Deverakonda Trolls

Vijay Deverakonda Trolls

Vijay Deverakonda Mother Cameo in Dear Comrade: విజయ్ దేవరకొండ చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరుగుతోంది. ఆ సంగతి అలా ఉంచితే ఒక ఆసక్తికరమైన అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. అదేంటంటే విజయ్ దేవరకొండ తల్లి మాధవి దేవరకొండ విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఒక సినిమాలో చిన్న అతిథి పాత్రలో కనిపించింది.

Ravinder Chandrasekar: సినీ నిర్మాత ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఆకస్మిక దాడులు

పాత్ర అనడం కంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే ఒక చిన్న ఆర్టిస్ట్ అని చెప్పవచ్చు. విజయ్ దేవరకొండ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమాలో మాధవి దేవరకొండ కాలేజీలో లెక్చరర్ పాత్రలో ఇలా కనిపించి అలా వెళ్ళిపోతారు. నిజానికి ఈ సినిమా రిలీజ్ అయి ఈ ఏడాది ఐదేళ్ల పూర్తయ్యాయి. అప్పట్లో ఈ సినిమాకి మంచి టాక్ అయితే వచ్చింది. కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే ఈ సినిమాతోనే భరత్ కమ్మ అనే దర్శకుడు దర్శకుడిగా పరిచయమయ్యాడు.

Show comments