విజయ్ దేవరకొండ ఖుషి సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన కింగ్‌డమ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తయింది, రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సినిమా అవుట్‌పుట్ విషయంలో టీం సంతృప్తిగా లేకపోవడంతో చాలా రీషూట్స్ చేశారు. అయితే, సినిమా ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడింది.
Also Read:Supritha: అమెరికాలో సుప్రీత.. “ఎంత ముద్దుగున్నావే”!
ఇక తాజాగా సినిమా రిలీజ్ డేట్ ప్రోమోతో లేటెస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సినిమా రిలీజ్ డేట్ ప్రోమోతో మరోసారి ఒక్కసారిగా అంచనాలు పెంచే ప్రయత్నం చేసింది కింగ్‌డమ్ టీం. ఇక తాజా ప్రకటన మేరకు ఈ సినిమా ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 24వ తేదీన హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా వచ్చిన వారం రోజులకు కింగ్‌డమ్ కూడా బరిలోకి దిగబోతోంది.
Also Read:NBK111: బాలయ్య్య రెండో వైపు చూపిస్తారట!
ఈ సినిమాను నాగ వంశీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుండగా, మొదటి భాగం ఈ నెల 31వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీలంక సాయుధ పోరాటం నేపథ్యంలో ఈ సినిమా సాగబోతున్నట్టు ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో కొంత క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ రోజు రిలీజ్ చేసిన రిలీజ్ డేట్ ప్రోమో కట్ సినిమా మీద మరింత అంచనాలు పెంచేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చూసేయండి!
