అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిన్న పోలీసులు అరెస్ట్ చేయడంతో అల్లు అర్జున్ ని చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. అయితే ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో అల్లు అర్జున్ ని పోలీసులు విడుదల చేశారు. దీంతో ఆయన జూబ్లీహిల్స్ లో నివాసానికి వెళ్లారు. ఇక ఒక్కరు ఒక్కరుగా సినీ ప్రముఖులు ఆయన నివాసానికి తరలి వెళ్తున్నారు. ముందుగా మైత్రి నిర్మాతలు రవి, నవీన్ తో పాటు దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. సుకుమార్ ని చూసి అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యాడు.
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి సుకుమార్, మైత్రీ నిర్మాతలు
వెంటనే హత్తుకుని కాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు ఈ ఇద్దరూ. ఇక తాజాగా అల్లు అర్జున్ నివాసానికి విజయ్ దేవరకొండతో పాటు ఆనంద్ దేవరకొండ కూడా వెళ్లినట్లుగా తెలుస్తోంది. రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు అల్లు అర్జున్ కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అల్లు అర్జున్, అల వైకుంఠపురంలో సినిమా విడుదల సమయంలో విజయ్ దేవరకొండ తన రౌడీ బ్రాండ్ నుంచి ఐకాన్ పేరుతో ఉన్న బట్టలను కూడా పంపించారు. ఆ తర్వాత ప్రమోషన్స్లో వాటిని వాడారు అల్లు అర్జున్. ఇక తాజాగా దేవరకొండ బ్రదర్స్ ఇద్దరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.