Site icon NTV Telugu

Toofan: చివరి నిముషంలో వెనక్కి తగ్గిన విజయ్ ఆంటోనీ.. రిలీజ్ ఎప్పుడంటే?

Vijay Antony Tufan

Vijay Antony Tufan

Vijay Antony’s “Toofan” to release on August 9 : హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తుఫాన్” ఈరోజు రిలీజ్ కావాల్సి ఉంది. అయితే తెలుగు సినిమాలే మరో ఐదు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వాయిదా వేసినట్టు చెబుతున్నారు. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించగా పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో “తుఫాన్” సినిమాను రూపొందించారు దర్శకుడు విజయ్ మిల్టన్.

Malvi Malhotra: నిజాలన్నీ బయటికొస్తాయి ఆగండి.. మాల్వీ కీలక వ్యాఖ్యలు

ఇక వాయిదా పడ్డ “తుఫాన్” సినిమా శ్రీ సిరి సాయి సినిమాస్ ద్వారా ఆగస్టు 9న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన స్నీక్ పీక్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ కు కొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇవ్వబోతోంది “తుఫాన్” మూవీ అని చెబుతున్నారు మేకర్స్. శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు నటించిన ఈ సినిమా కి యాక్షన్ సుప్రీమ్ సుందర్ కొరియోగ్రాఫర్. అచ్చు రాజమణి, విజయ్ ఆంటోనీ మ్యూజిక్ ఆంచిందిన ఈ సినిమాకి భాష్య శ్రీ డైలాగ్ రైటర్.

Exit mobile version