Site icon NTV Telugu

Ajay Dhishan: ఇండస్ట్రీలోకి మరో వారసుడు.. కానీ విలన్ గా?

Vijay Antony

Vijay Antony

విజయ్ ఆంటోని ప్రస్తుతం మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ ‘గగన మార్గన్’ అనే సినిమాను చేస్తున్నారు. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, మీరా విజయ్ ఆంటోని సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇది వరకు రిలీజ్ చేసిన విజయ్ ఆంటోనీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని మేనల్లుడు (సోదరి కొడుకు) అజయ్ ధీషన్‌ను విలన్‌గా పరిచయం చేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్‌ను చూస్తుంటే విజయ్ ఆంటోనీ, అజయ్‌ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండేలా కనిపిస్తోంది. ఈ రెండు పాత్రలు తలపడే సీన్లు ప్రేక్షకులకు ఆడ్రినలిన్ రష్‌ ఇచ్చేలా ఉంది.

Tamannaah Bhatia: శుభవార్త చెప్పనున్న తమన్నా?

సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషించారు. యువ.ఎస్ సినిమాటోగ్రఫర్‌గా, విజయ్ ఆంటోని స్వయంగా సంగీతం సమకూర్చుతుండగా.. రాజా.ఎ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. “గగన మార్గన్” అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే హృద్యమైన కుటుంబ చిత్రంగా రాబోతోంది. త్వరలో థియేటర్లలోకి ఈ సినిమాను తీసుకొచ్చేందుకు యూనిట్ సిద్ధంగా ఉంది. విజయ్ ఆంటోని, అజయ్ ధీషన్, సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి మరియు అంతగారం నటరాజన్ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version