NTV Telugu Site icon

Vijay Antony: నన్ను క్షమించండి.. విచారం వ్యక్తం చేస్తూ విజయ్ ఆంటోని కీలక ప్రకటన!

Vijay Antony

Vijay Antony

విజయ్ ఆంటోని తమిళ సినీ పరిశ్రమలో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసి నటుడిగా మారాడు. 2005లో ఎస్‌ఎ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహించిన ‘సుక్రన్‌’ చిత్రంతో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేశారు. మొదటి సినిమాలోనే తన సంగీతంతో ఆకట్టుకున్న విజయ్ ఆంటోని ఈ సినిమా తర్వాత డిషూమ్, ఇరువర్ అహలి, నాన్ అవన్ అలై, వంతమ్, వాలందియిల్ కలేతేన్ సహా 20కి పైగా చిత్రాలకు సంగీతం అందించే అవకాశం అందుకున్నాడు. ఆ తర్వాత విజయ్ ఆంటోనీ పూర్తి స్థాయి నటుడిగా మారారు, తన కొన్ని చిత్రాలకు మాత్రమే సంగీత స్వరకర్తగా పనిచేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే 2012లో ‘నాన్’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన విజయ్ ఆంటోనీకి తొలి సినిమా హిట్ అయింది. సలీం, ఇండియా పాకిస్తాన్ వంటి తదుపరి చిత్రాలు ఓ మాదిరి విజయాన్ని అందుకున్నప్పటికీ, ‘పిచైకారన్’ చిత్రం ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ముఖ్యంగా తమిళం కంటే తెలుగులో ఎక్కువ ఆదరణ పొందింది. దీని తర్వాత విజయ్ ఆంటోని గత ఏడాది ‘పిచైకారన్ 2’ చిత్రానికి దర్శకత్వం వహించి నటించారు.

Harish Rao: బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతుంది..

ఇక ఈ ఏడాది విజయ్ ఆంటోని నటించిన రోమియో, తుపాన్, హిట్లర్ అంటూ మూడు సినిమాలు వరుసగా విడుదలయ్యాయి. అయితే ఈ మూడు సినిమాలూ ఆశించిన స్థాయిలో విజయం సాధించకలేదు.. ఆ సంగతి అలా ఉంచితే విజయ్ ఆంటోని సంగీత స్వరకర్త అని గుర్తు చేస్తూ గత ఏడాది రెండేళ్లుగా ఏఆర్ రఘుమాన్, జివి ప్రకాష్, ఇళయరాజా తరహాలో లైవ్ కాన్సర్ట్‌లు నిర్వహిస్తున్నాడు. అతని షోలకు ఇప్పటికే మంచి స్పందన రావడంతో ఈరోజు విజయ్ ఆంటోని 3.0 లైవ్ కాన్సర్ట్‌ చెన్నైలో ప్లాన్ చేశారు. అయితే ఏమైందో ఏమో తెలియదుకానీ ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మరో తేదీకి మార్చేసి విచారం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో “హలో ఫ్రెండ్స్. కొన్ని అనుకోని కారణాల వల్ల , చెన్నైలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఈ రోజు జరగాల్సిన విజయ్ ఆంటోని 3.0 లైవ్ కాన్సర్ట్ ప్రభుత్వ అధికారుల సూచన మేరకు మరొక తేదీకి వాయిదా వేయబడింది. మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించండి. కొత్త ఈవెంట్ యొక్క తేదీ త్వరలో ప్రకటించబడుతుంది అంటూ ఆయన రాసుకొచ్చారు.

Show comments