తమిళ సినిమాల్లో గుర్తింపు ఉన్న హీరో విజయ్ ఆంటోనికి ‘బిచ్చగాడు’తో తెలుగునాట కూడా ఫాలోయింగ్ వచ్చింది. అందరినీ ఆలోచింపచేసే కథాంశాలతో సినిమాలు చేస్తూ వస్తున్న విజయ్ ఆంటోని తాజాగా ‘విక్రమ్ రాథోడ్’ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. పెప్సి శివ సమర్పణలో బాబు యోగేశ్వరన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రెమిసెస్ హీరోయిన్. సురేష్ గోపి, సోనూసూద్, యోగిబాబు ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాకు ఎస్.కౌశల్య రాణి నిర్మాత.
దీనిని తెలుగులో రావూరి వెంకటస్వామి విడుదల చేస్తున్నారు. ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎమోషనల్ థ్రిల్లర్ కథాంశంతో ఉంటుందని, ఇందులో యస్.పి.బి పాడిన ‘కన్నా.. దిగులవకు తొడున్నా.. నీ కొరకు’ పాట హైలెట్ అవుతుందంటున్నారు నిర్మాతలు. సత్యం, న్యాయం, ధర్మం కోసం పోరాడే హీరోతనను ఓ టెర్రరిస్ట్ గానో.. ఎక్స్‌ట్రీమిస్ట్ గానో భావించిన వారికి తానొక కామన్ మేన్ ని మాత్రమే అని చెప్పటం ద్వారా సినిమాపై ఆసక్తిని పెంచాడంటున్నారు. ఈ నెలాఖరులో సినిమాను విడుదల చేస్తామంటున్నారు దర్శకనిర్మాతలు.
