తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ త్వరలో పూర్తి స్థాయి రాజకీయలల్లో అడుగుపెట్టనున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘తమిళగ వెట్రి కజగం’ అనే పార్టీని స్థాపించాడు కూడా.విజయ్ సినీ కెరీర్ లో చివరి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఖాకి, తునీవు వంటి సినిమాలు తెరకెక్కించిన H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. విజయ్ కెరీర్ లో 69వ సినిమాగ రానున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించబోతున్నట్టు అధికారంగా ప్రకటించారు మేకర్స్.
Also Read : Pavan Kalyan : నేడు ‘తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న పవర్ స్టార్ పవన్..!
ఇప్పడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాలలోకెళితే తెలుగులో గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ దర్శకుడి అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం భగవంత్ కేసరి. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఇటీవల సైమా, ఐఫా వంటి వేడుకల్లో ఉత్తమ చిత్రంగా అవార్డులు సైతం గెలుచుకుంది. అసలు విషయం ఏంటంటే ఇప్పడు ఈ సినిమాను H. వినోద్ దర్శకత్వంలో విజయ్ రీమేక్ చేయబోతున్నాడని కోలీవుడ్ కోడై కూస్తోంది. చివరి సినిమాగా హిట్ సినిమాతో సినీ కెరీర్ ముగించాలని అందుకే సేఫ్ గా రీమేక్ చిత్రం ఎంచుకున్నారని విజయ్ ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేసి తెరకేక్కిస్తారని టాక్. మరి ఈ వార్తల్లో నిజమెంతుందోననేది నిర్మాణ సంస్థ ప్రకటిస్తుందేమో చూడాలి. విజయ్ కు జోడిగా బాలీవుడ్ భామ పూజ హెగ్డే నటిస్తోన్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.