Site icon NTV Telugu

Vidya Balan : ఆ నిర్మాత కారణంగా నేను అద్దం చూసుకోవడం మానేశా..

Vidhya Ballan

Vidhya Ballan

సినిమా ఇండస్ట్రీలో నటినటులు కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు, అలాగే అడ్డంకులను ఎదుర్కొని ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే ఫిట్నెస్, లుక్స్ విషయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొంటారు ఉంటారు. ఒకప్పుడు విపరీతమైన అవమానాలు భరించి ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతున్న ముద్దుగుమ్మలు చాలామంది ఉన్నారు. అందులో బాలీవుడ్ స్టార్ విద్య బాలన్ ఒకరు. ఈ హీరోయిన్ అందంగా లేదని అలాగే లావుగా ఉన్నావంటూ ఆమెను ఏకంగా 13 సినిమాల నుంచి తిరస్కరించారట. అయినా కూడా అన్ని దాటుకుంటూ గ్లామర్ పాత్రలు కాకుండా విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ మంచి సార్‌డమ్ సంపాదించుకుంది ఈ చిన్నది. అయితే తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ నిర్మాత కారణంగా తాను ఎదురుకున్న సమస్య గురించి చెప్పుకుంది.

Also Read: Pooja Hegde : నాని తో వర్క్ చేయాలని ఉంది..

విద్య మాట్లాడుతూ.. ‘ఒక నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు.. అసభ్యంగా పిలిచాడు. అతను నన్ను అలా అవమానించిన తర్వాత నేను అద్దంలో ఆరు నెలలు నా ముఖం కూడా చూసుకోలేదు. ఎదుటి వ్యక్తులు మాట్లాడే మాటలు నాపై నాకున్న నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేశాయి. అలాగే ఒక సినిమా కోసం నేను బరువు పెరుగుతున్న సమయంలో బాడీ షేమింగ్ చేసేవారు. ఒక సారి మలయాళం‌లో కూడా అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా ప్రారంభం కాకముందే ఆగిపోయింది. దీంతో నను దురదృష్టవంతురాలు అభివర్ణించారు. మూవీ టీం ఆపేసిన అక్కడ నను బ్లెమ్ చేశారు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి చాలా ఉంటాయి’ అని తెలిపింది విద్య.

Exit mobile version