NBK112 : బాలయ్య సరసన బాలీవుడ్ బ్యూటీ.. ఈసారి లెక్క వేరే

Nbk 112

Nbk 112

నందమూరి బాలకృష్ణ మరియు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో పట్టాలెక్కబోతున్న NBK 112 చిత్రం గురించి రోజుకో ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే తమిళ సెన్సషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో ఈ సినిమాపై హైప్ అమాంతం పెంచింది. ఇప్పడు మరో న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో హీరోయిన్ గా బాలీవుడ్ వెర్సటైల్ యాక్ట్రెస్ విద్యాబాలన్ నటిస్తోందట. గతంలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో బాలయ్యకు జోడీగా నటించిన విద్యాబాలన్ సుమారు ఏడేళ్ల తర్వాత మళ్ళీ బాలయ్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం.

డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను డిజైన్ చేశారని అందులో విద్యాబాలన్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. మాఫియా నేపథ్యంలో సాగే ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో బాలయ్య ‘ఊరమాస్’ అవతారంలో కనిపిస్తారని ఆయనకి జోడిగా పవర్‌ఫుల్ పాత్రలో విద్యాబాలన్ మెరవబోతుందట. SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌ సంయుక్తంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది. విద్యాబాలన్ కూడా తోడైతే ఈ సినిమాకు పాన్-ఇండియా అప్పీల్ వస్తుందని భావిస్తున్నారు మేకర్స్. ఈ ఏడాది ఆగస్టులో షూటింగ్ ప్రారంభించి 2027 సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటిస్తున్న బాలయ్య మే 9నుండి