బాలీవుడ్ లో గడచిన పాతికేళ్లలో సూపర్ స్టార్లుగా ఎదిగింది కేవలం ఇద్దరే హీరోలు హృతిక్ రోషన్, రణబీర్ కపూర్ అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో చాలామంది హీరోలు, స్టార్లు హిందీ సినిమాలో ఎంట్రీ ఇచ్చినా సూపర్ స్టార్ రేంజ్ మాత్రం అందుకోలేకపోయారు. కానీ ప్రస్తుతం వరుస హిట్లతో పాటు నటన పరంగా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ విక్కీ కౌశల్ బాలీవుడ్ నయా సూపర్ స్టార్‌గా అవతరించాడు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ‘చావా’ సినిమాలో విక్కీ నటనకు బాలీవుడ్ ఫిదా అయితే.. మరాఠా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో బాలీవుడ్ కొంత ఊపిరి పీల్చుకుంది. అయితే తాజాగా..
Also Read : Rajasab : రెమ్యునరేషన్ తగ్గించిన ప్రభాస్..!
విక్కీ కౌశల్ ‘ఇప్పుదాయన’ బయోపిక్లో నటించనున్నట్లు తెలుస్తోంది. నటుడిగా, నిర్మాతగా బాలీవుడ్ లో ఎన్నో క్లాసిక్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన లెజెండరీ దర్శకుడు గురుదత్ ఈ బయోపిక్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం పై విక్కీతో చర్చలు జరుగుతున్నాయట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అలా మీడియా సంస్థ రూపొందించనున్న ఈ బయోపిక్ విక్కీకౌశల్ భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
