NTV Telugu Site icon

Rajnikanth: వెట్టయాన్ తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కుల డీల్ క్లోజ్

Untitled Design

Untitled Design

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ ఎంతటి ఘాన విజయం సాధించిందో తెలిసిన విషయమే. తమిళ్ తో పాటు టాలీవుడ్ లోను జైలర్ అదిరిపోయే రేంజ్ కలక్షన్స్ రాబట్టింది. ఆ ఉత్సహంతో రాబోయే సినిమాలు కూడా హిట్ అవ్వాలని ఎక్కడాకూడా కాంప్రమైస్ కాకుండా కథ, కథనాల విషయంలో పక్కాగా ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు తలైవా. ప్రస్తుతం జైభీమ్ వంటి సందేశాత్మక చిత్రనికి దర్శకత్వం వహించిన టి.జె జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్‌’ నటిస్తున్నాడు తలైవర్.

షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ఆ దశలోనే వెట్టయాన్‌ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ ఏర్పడింది. గతంలో జైలర్ భారీ లాభాలు తెచ్చిపెట్టడంతో ఇప్పుడు ఈ సినిమాకు బయ్యర్స్ పోటీపాడుతున్నారు. తాజగా వెట్టయాన్‌ తెలుగు స్టేట్స్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేశారు మేకర్స్. తెలంగాణ, ఆంధ్ర (సీడెడ్ మినహా) హక్కులను ఏషియన్ సినిమాస్ నిర్మాత ఏషియన్ సునీల్ రూ.14 కోట్లకు కొనుగోలు చేసాడు. ఇక సీడెడ్ హక్కులను మరో ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ కొనుగోలు చేసారు. ఆంధ్రా ప్రాంతం (నాన్ సీడెడ్) 8-9 కోట్లకు అమ్ముడవుతుండగా, నైజాం హక్కుల విలువ 7 కోట్లు వరకు చెబుతున్నారు . ఈ చిత్రంలో టాలివుడ్ నటుడు రానాదగ్గుబాటి విలన్‌గా నటిస్తున్నారు. అటు మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ తో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.అత్యంత భారీ బడ్జెట్ లో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

Show comments