ప్రభాస్ పాన్ ఇండియా మూవీ నుంచి తప్పుకున్న సీనియర్ డైరెక్టర్…!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా అనౌన్స్ చేసిన కొన్ని రోజులకే అలనాటి ప్రముఖ సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా ఈ సినిమా కోసం పని చేయబోతున్నారని ప్రకటించారు. సింగీతం దర్శకత్వ పర్యవేక్షణలో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని, స్క్రిప్ట్ విషయంలో కూడా ఆయన సూచనలు, సలహాలు తీసుకుంటారని తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రం నుంచి తప్పుకున్నారట. డైరెక్షన్ టీంతో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ అందుకే కారణమని అంటున్నారు. అయితే ఈ విషయంపై చిత్రబృందం ఇంకా స్పందించలేదు. ఇందులో నిజం ఎంతో తెలీదు కానీ… ప్రభాస్ అభిమానులకు మాత్రం షాకిచ్చే విషయమే. కాగా సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా… అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మించనుంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. జూలైలో సినిమా మొదలుపెడదాం అనుకొనేలోగా కరోనా సెకండ్ వేవ్ వచ్చేసింది. దీంతో ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌కు వాయిదా పడింది. ఈలోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్, యాక్షన్ సీక్వెన్స్, టెక్నికల్ పనులపై నాగ్ అశ్విన్ మరింత దృష్టి సారించాలనుకుంటున్నారట. అక్టోబర్ షెడ్యూల్ లో దీపికా పాల్గొనబోతుందని సమాచారం. ఇక ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘సలార్’ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
Also Read
- Meghamsh Srihari: నాన్నగారిలాగే నన్నూ ఆశీర్వదించండి
- Suriya: ‘‘ఈ సక్సెస్‌ను నంబర్లతో కొలవలేం’’.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై సూర్య ఎమోషనల్ కామెంట్స్!
- Trivikram Srinivas: సూర్యతో సినిమా చేయలేకపోయా.. త్వరలోనే చేస్తా: త్రివిక్రమ్ శ్రీనివాస్
- Venky Atluri: ‘‘ఫ్యామిలీ సినిమా వద్దన్నారు.. కానీ వంశీ గారు నన్ను నమ్మారు’’.. వెంకీ అట్లూరి ఎమోషనల్!
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!