Site icon NTV Telugu

VenuYeldandi : ‘బలగం వేణు’ కథలో బలం లేదా.. యంగ్ హీరో ఛాన్స్ ఇచ్చేనా..?

Untitled Design (38)

Untitled Design (38)

బలగం సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు దర్శకుడు వేణు. 2023 లో విడుదలైన ఈసినిమా అటు వేణు కు ఇటు కథ నాయకుడు ప్రియదర్శికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. దర్శకుడు వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. కఇదిలా ఉండగా ఈ సినిమా వచ్చి ఏడాదిపైగా అవుతున్న కూడా ఇప్పటికి మరో సినిమా మొదలెట్టలేదు. బలగం ను నిర్మించిన దిల్ రాజు బ్యానర్ లోనే రెండవ సినిమా కూడా చేయాల్సి ఉంది వేణు.

Also Read : Rebel Star : కల్కి – 2 టైటిల్, కథ, కథనానికి సంబంధించి కీలక విషయాలు..

రెండవ సినిమా కోసం చాలా కాలం కిందటే ఓ కథ రెడీ చేసుకున్నాడు వేణు. ఆ కథను పలువురు హీరోలకు వినిపించాడు కూడా కానీ ఎందుకనో ఎక్కడ ఫైనల్ అవ్వలేదు. ఆ మధ్య నేచురల్ స్టార్ నాని దగ్గర దాదాపు ఓకే అయినట్టే అని వినిపించింది, కానీ సెకండ్ హాఫ్ పట్ల నానిమరొక వెర్షన్ అడిగాడని మార్చిన కూడా అక్కడ ఒకే అవ్వలేదు. అటు తిరిగి ఇటు తిరిగి మరొక యంగ్ హీరో నితిన్ దగ్గరకు వచ్చిందని టాక్. కథ నితిన్ వినాల్సి ఉందని సమాచారం. స్టోరీ చెప్పాలి మల్లి మార్పులు చేర్పులు ఉంటే చేయాల్సి ఉంటుంది. కానీ వేణు మార్పులు లేకుండా తాను రాసుకున్న కథను తెరకెక్కించాలని గట్టిగా ఉన్నాడు. చూడాలి మరి ఎం జరుగుతుందో. ఇంకా గ్రీన్ సిగ్నల్ రాని ఈ కథకు నిర్మాత దిల్ రాజు యల్లమ్మ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసి ఉంచారు. నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు జెట్ స్పీడ్ లో రెడీ అవుతున్నాయి.

Exit mobile version