స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో ‘ఐకాన్’ చిత్రం ఉంటుందని ప్రకటించి ఇప్పటికే చాలా కాలం గడుస్తోంది. 2019లో మేకర్స్ నుంచి ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. అప్పటినుంచి దర్శకుడు వేణు శ్రీరామ్ బన్నీ గురించి ఎదురు చూస్తూనే ఉన్నాడు. కారణాలేంటో తెలియదు గానీ ఇప్పటివరకు ‘ఐకాన్’ పట్టాలెక్కలేదు. బన్నీ ‘అలా వైకుంఠపురంలో’ తరువాత ‘ఐకాన్’ సెట్స్ పైకి వెళ్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు సరికదా సుకుమార్ తో ‘పుష్ప’కు కమిట్ అయ్యాడు బన్నీ. దీంతో ‘ఐకాన్’ మళ్ళీ మూలన పడిపోయింది. ఇక దర్శకుడు వేణు శ్రీరామ్ ‘వకీల్ సాబ్’తో బిజీ అయిపోయాడు. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వేణు శ్రీరామ్ ‘ఐకాన్’పై దృష్టి పెట్టాడట. అయితే తాజా సమాచారం ప్రకారం దర్శకుడు వేణు శ్రీరామ్ ‘ఐకాన్’గా ప్రభాస్ ను వెండి తెరపై చూపించాలని అనుకుంటున్నాడట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ వేణు శ్రీరామ్ తన ‘ఐకాన్’ ప్రభాస్ ను కలవాలని భావిస్తున్నాడట. మరోవైపు ‘ఐకాన్’ నిర్మాత ప్రభాస్ తో సినిమాను నిర్మించడానికి చాలాకాలం నుంచి ఎదురు చూస్తున్నాడు. ప్రభాస్ ‘ఐకాన్’కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తన ఆశ నెరవేరినట్టే అని భావిస్తున్నాడట దిల్ రాజు. మరి ప్రభాస్ ‘ఐకాన్’కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.
‘ఐకాన్’ కోసం ప్రభాస్ కావాలంటున్న దర్శకుడు…?
