Site icon NTV Telugu

Vennela Kishore : బ్రహ్మానందం వారసుడు అన్నది ఒప్పుకోను!

Vennela Kishore Brahmananda

Vennela Kishore Brahmananda

ఇటీవల బ్రహ్మానందం కీలకపాత్రలో “బ్రహ్మ ఆనందం” అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కూడా నటించాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బ్రహ్మానందం మాట్లాడుతూ, “తనకు వారసుడు అంటే అది వెన్నెల కిషోరే” అనేలా ఆయన మాట్లాడారు. తాజాగా “సింగిల్” సినిమా సక్సెస్ నేపథ్యంలో వెన్నెల కిషోర్ మీడియాతో ముచ్చటించాడు.

Also Read : Vennela Kishore : ప్రమోషన్స్ కి అందుకే దూరంగా ఉండేవాడిని.. కానీ ఇప్పుడు?

ఈ సందర్భంగా ఆయనకు ఇదే ప్రశ్న ఎదురైంది. “లెజెండ్ లాంటి బ్రహ్మానందం నాకు వారసుడు వెన్నెల కిషోరే అన్నాడు. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు?” అని అడిగితే, దానికి చాలా సమయం స్ఫూర్తితో, వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు వెన్నెల కిషోర్. “నేను దాన్ని తీసుకోను. వెంటనే వాట్సాప్‌లో ఆయనకి పంపించేశాను” అంటూ సమాధానం ఇచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ, “అది నా మీద బ్రహ్మానందం గారికి ఉన్న ప్రేమ. ఏదో అంత గొప్పవాడిని అవ్వాలని ఆశీర్వదిస్తూ మాట్లాడారు. సాధారణంగా మనం ఎప్పుడైనా చిన్నపిల్లలను చూస్తే, వీడు చిరంజీవి అంతటవాడవుతాడు అని సరదాగా అంటాం. అలా అని వాడు చిరంజీవిగా అయిపోడు కదా? అలా అవ్వాలని దీవెన ముఖ్యం” అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

Exit mobile version