NTV Telugu Site icon

Venky Atluri: హను రాఘవపూడి, నాగ్ అశ్విన్ లకు ఆడిషన్ ఇచ్చా.. షాకింగ్ విషయం బయటపెట్టిన స్టార్ డైరెక్టర్

Venky Atluri

Venky Atluri

తెలుగులో మిస్టర్ మజ్ను, రంగ్ దే లాంటి కొన్ని సినిమాలు చేసి ఓ మాదిరి రిజల్ట్స్ అందుకున్న వెంకీ అట్లూరి తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ అనే సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సక్సెస్ స్వీట్ నిర్వహించింది సినిమా యూనిట్. ఇక ఈ సక్సెస్ మీట్ లో వెంకీ అట్లూరి ఆసక్తికరమైన విషయం బయట పెట్టాడు. తాను నటుడిగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అంటే 2008 ఆ సమయంలో హను రాఘవపూడి, నాగ్ అశ్విన్ ఇద్దరికీ ఆడిషన్స్ ఇచ్చానని అన్నారు.

Sikandar : హైదరాబాద్ లో సల్మాన్ ఖాన్.. సెక్యురిటీ ఫుల్ టైట్..

అప్పటికి వీరిద్దరూ డైరెక్టర్లు అవ్వలేదు కానీ హను రాఘవపూడికి చంద్రశేఖర్ ఏలేటి గారి సినిమా ఆడిషన్ ఇచ్చాను. తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకి నాగ్ అశ్విన్ కి ఆడిషన్ ఇచ్చాను. ఆరోజు నేను సెలక్ట్ కాలేదు. అయితే ఈరోజు మాత్రం లక్కీ భాస్కర్ అనే సినిమాతో హిట్టు కొట్టి ఇక్కడ నిలబడ్డాను. హను రాఘవపూడి గారు దుల్కర్ తో సీతారామం సినిమా చేశారు. నాగశ్విన్ గారు మహానటి సినిమా చేశారు. అదే దుల్కర్ తో నేను లక్కీ భాస్కర్ అనే సినిమా చేయడం ఆనందంగా ఉంది. వారితో కలిసి స్టేజ్ షేర్ చేసుకోవడం మరింత ఆనందంగా ఉంది అంటూ ఈ సందర్భంగా వెంకీ అట్లూరి చెప్పుకొచ్చారు.

Show comments