Sankranthiki Vasthunnam: ఓటీటీలో కూడా సంక్రాంతికి వస్తున్నాం సరికొత్త రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాని అనిల్ రావిపూడి డైరెక్టు చేయగా విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏకంగా 303 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి దిల్ రాజుకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది. ఇక ఈ సినిమాని జీ తెలుగు ఛానల్లో నిన్న ప్రసారం చేయగా అదే సమయానికి జీ5 ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ మొదలుపెట్టారు. ఇక జీ5 ఓటీటీ హిస్టరీలోనే ఇది అత్యంత బ్లాక్ బస్టర్ వ్యూస్ తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. 12 గంటలలోనే 100 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అయినట్లుగా గుర్తించారు.
VV Vinayak: మరోసారి అస్వస్థతకు గురైన వినాయక్
Also Read
- Maheshwara Reddy: రివ్యూలపై 'ఓ సుకుమారి' నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. 'ది ఒడిస్సీ'కి అదిరిపోయే ఓపెనింగ్!
- Fauji: ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేసిన ప్రభాస్.. 'ఫౌజీ' ఫస్ట్ లుక్‌తో ఆల్‌టైమ్ రికార్డు!
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్‌ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
సుమారు 1.3 మిలియన్ వ్యూవర్స్ ఈ సినిమా వీక్షించినట్లుగా వెల్లడించారు. జీ5లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని టీం చెబుతోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణంలో ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మించారు. సుమారు ఈ సినిమా 50 రోజుల పాటు 100 ధియేటర్లలో ప్రదర్శితం అవడం అంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. అలాంటిది ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చాక మరింత ఆదరణ దక్కించుకుంటుంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ బాగా వర్క్ అవుట్ కావడంతో పాటు బుల్లి రాజు అనే బుడ్డోడు క్యారెక్టర్ కూడా పేలడంతో సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టారు. ఇప్పుడు అదే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా మీద మరింత ఆసక్తి కనబరుస్తూ ఉండడం గమనార్హం.
తాజావార్తలు
-
Kapil Dev: “బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి”.. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Anaconda vs Python: అనకొండా, కొండచిలువ ఒకటే అనుకుంటున్నారా? అసలు తేడా ఇదే!
-
Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
-
KTR : స్థానిక యువతకు 95 శాతం ఉద్యోగాలు సాధించింది కేసీఆరే
-
Maheshwara Reddy: రివ్యూలపై ‘ఓ సుకుమారి’ నిర్మాత షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!