సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాని అనిల్ రావిపూడి డైరెక్టు చేయగా విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏకంగా 303 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి దిల్ రాజుకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది. ఇక ఈ సినిమాని జీ తెలుగు ఛానల్లో నిన్న ప్రసారం చేయగా అదే సమయానికి జీ5 ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ మొదలుపెట్టారు. ఇక జీ5 ఓటీటీ హిస్టరీలోనే ఇది అత్యంత బ్లాక్ బస్టర్ వ్యూస్ తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. 12 గంటలలోనే 100 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అయినట్లుగా గుర్తించారు.
VV Vinayak: మరోసారి అస్వస్థతకు గురైన వినాయక్
సుమారు 1.3 మిలియన్ వ్యూవర్స్ ఈ సినిమా వీక్షించినట్లుగా వెల్లడించారు. జీ5లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని టీం చెబుతోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణంలో ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మించారు. సుమారు ఈ సినిమా 50 రోజుల పాటు 100 ధియేటర్లలో ప్రదర్శితం అవడం అంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. అలాంటిది ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చాక మరింత ఆదరణ దక్కించుకుంటుంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ బాగా వర్క్ అవుట్ కావడంతో పాటు బుల్లి రాజు అనే బుడ్డోడు క్యారెక్టర్ కూడా పేలడంతో సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టారు. ఇప్పుడు అదే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా మీద మరింత ఆసక్తి కనబరుస్తూ ఉండడం గమనార్హం.