Site icon NTV Telugu

నిర్ణయం మార్చుకున్న ‘నారప్ప’

త్వరలోనే థియేటర్లు తెరచుకొనే సూచనలు కనిపిస్తుండటంతో ఓటీటీ బాట పట్టే సినిమాలు తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నాయి. తెలంగాణలో ఇప్పటికే పర్మిషన్ ఉండగా.. ఏపీలోనూ రీసెంట్ గా థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే తాజాగా విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ‘నారప్ప’ సినిమా ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపగా.. ఒకే చేశారనే ప్రచారం కూడా జరిగింది. కాగా, నారప్ప నిర్మాతలు థియేటర్లోనే విడుదల చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. రీసెంట్ గా జరిగిన డిస్ట్రిబ్యూటర్ల చర్చలతో.. అతిత్వరలోనే తెర తెరవనున్నారనే సమాచారంతో నారప్ప థియేట్రికల్ విడుదల తేదీపై ఫోకస్ చేసింది. కొద్దిరోజుల్లోనే విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, వెంకటేశ్ భార్య పాత్రలో ప్రియమణి కనిపించనుంది. తమిళంలో ధనుష్ హీరోగా వచ్చిన ‘అసురన్’ సినిమాకి రీమేక్ గా వస్తున్నా విషయం తెలిసిందే.

Exit mobile version