సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. నారప్ప, దృశ్యం-2, ఎఫ్-3 చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. వాటి తరువాత వెంకటేష్ నటించబోయే చిత్రం ఇదేనంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే గత కొంతకాలం క్రితం వెంకటేష్ దగ్గుబాటి, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మూవీ రాబోతోందంటూ ఊహాగానాలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఇటీవలే వెంకీ మామ 75వ సినిమాకు సంబంధించి చర్చలు జరిగాయట. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి వెంకటేష్ కూడా ఆసక్తిని కనబరుస్తున్నారట. ఈ వార్తలు గనుక నిజమైతే వారి ప్రస్తుత ప్రాజెక్టులతో పూర్తయిన తర్వాత ఈ చిత్రం ప్రారంభమవుతుంది. మరోవైపు త్రివిక్రమ్ ఇటీవల మహేష్ బాబుతో ఒక చిత్రాన్ని ప్రకటించారు. ప్రస్తుతానికి ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28’గా పిలవబడుతున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో తెరపైకి రానుంది.
వెంకీ 75వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ?
