Site icon NTV Telugu

Venkatesh: గురూజీ… వెంకీ మామతో ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా ?

Vankatedh Trivikram

Vankatedh Trivikram

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. హారిక హాసిని సంస్థతో పాటు త్రివిక్రమ్ కు చెందిన ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంస్థ నిర్మించబోతున్న ఈ సినిమా గురించి ఆసక్తికరమైన ప్రచారం తెరమీదకు వచ్చింది. వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు షూట్ మొదలు కాలేదు. ప్రస్తుతానికి విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Also Read:Arjun Chakravarthy : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’..ఎక్కడ చూడాలంటే ?

అయితే, త్రివిక్రమ్ సినిమాలో వెంకటేష్ ఒక సెక్యూరిటీ గార్డ్ పాత్రలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ త్రివిక్రమ్ రాసుకున్న ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లోనే ఒక భిన్నమైన సినిమాగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఒక స్టార్ హీరోని సెక్యూరిటీ గార్డ్ లాంటి పాత్రలో చూపించడం కేవలం గట్స్ ఉన్న దర్శకులకు మాత్రమే చెల్లుతుందని, త్రివిక్రమ్ ఈ సినిమాతో అసలు ఏం చేయబోతున్నాడో అనే చర్చ ఇప్పుడు తెరమీదకు వచ్చింది. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద ఆమె కూడా సానుకూలంగానే స్పందిస్తూ ఉండటంతో దాదాపుగా ఆమె నటించడం ఖరారైపోయినట్లే.

Exit mobile version