విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం రీమేక్ లపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇంతకుముందు ‘దృశ్యం’ మలయాళ చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్ తో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మరో రెండు రీమేక్ లలో నటిస్తున్నాడు. రీమేక్ చిత్రాలైన దృశ్యం-2, నారప్ప సినిమాల షూటింగ్ ను ఇటీవలే కంప్లీట్ చేశాడు వెంకటేష్. ఇప్పుడు వెంకటేష్ హీరోగా మూడవ రీమేక్ కోసం చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం మలయాళ బ్లాక్ బస్టర్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ తెలుగు రీమేక్ కోసం వెంకటేష్ తో చర్చలు జరుగుతున్నాయి. ‘డ్రైవింగ్ లైసెన్స్’ చిత్రం ఆధునిక సమాజంలో వర్గ అసమానతల ఆధారంగా తెరకెక్కింది. పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ నటించిన ఈ చిత్రం కేరళలో భారీ హిట్. ఈ రీమేక్ కు కనుక వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే… ‘డ్రైవింగ్ లైసెన్స్’ త్వరలో వెంకటేష్ ప్రధాన పాత్రలో తెలుగులో రీమేక్ కానుంది. కానీ ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలోనే ఉంది. మరి వెంకటేష్ ఈ రీమేక్ కు ఓకే చెప్తాడేమో వేచి చూడాలి. గతంలో ఈ ప్రాజెక్ట్ ను పలువురు స్టార్ హీరోలు రీమేక్ చేస్తారని వార్తలు విన్పించాయి. రవితేజ, విజయ్ సేతుపతి, రామ్ చరణ్ లు ఆ జాబితాలో ఉన్నారు.
మరో క్రేజీ రీమేక్ లో వెంకటేష్ ?
