Victory Venkatesh: కాలేజ్ లైఫ్ అంటే కేవలం క్లాస్ రూముల్లో కూర్చోవడమే కాదు.. క్లాసులు బంక్ కొట్టడంలోనూ ఓ స్పెషాలిటీ ఉందని విక్టరీ వెంకటేష్ సరదాగా వ్యాఖ్యానించారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన, తనదైన స్టైల్లో విద్యార్థులతో ముచ్చటిస్తూ సందడి చేశారు.
ఈ సందర్భంగా వెంకీ మామ మాట్లాడుతూ.. జీవితంలో మళ్లీ రాని అత్యుత్తమ సమయం కాలేజీ రోజులేనని, ఈ నాలుగేళ్ల జీవితాన్ని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలని చెప్పారు. “కాలేజ్ అంటే రోజూ క్లాసులకు వెళ్లడమే కాదు.. బంకింగ్ చేయడంలోనూ ఓ ప్రత్యేకత ఉంది. క్లాసుల్లో పాఠాలు వాళ్లు చెబితే మనం వింటాం, కానీ కొత్త ఐడియాలు మాత్రం బయటే వస్తాయి. అది కాఫీ షాప్ కావచ్చు, పార్కింగ్ ఏరియా కావచ్చు లేదా ఫ్రెండ్స్‌తో కలిసి తిరిగే చోటైనా కావచ్చు. అక్కడ మాట్లాడుకుంటున్నప్పుడే మన కలలు మొదలవుతాయి. వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడాలి. డిగ్రీ జాబ్ తెచ్చిపెడుతుందేమో కానీ, మంచి క్యారెక్టర్ డెవలప్ చేసుకోవడమే నిజమైన జీవితం” అంటూ తనదైన ఫిలాసఫీతో యూత్‌ను ఆకట్టుకున్నారు.
అనంతరం వేదిక పైనుంచి నేరుగా స్టూడెంట్స్ మధ్యలోకి వెళ్లి అందరినీ పలకరించడంతో ఆడిటోరియం ఈలలు, కేకలతో దద్దరిల్లిపోయింది. దర్శకుడు త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తదితరులకు ధన్యవాదాలు తెలిపిన వెంకటేష్, అక్టోబర్ 30న రిలీజ్ కానున్న తమ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరారు. క్లాస్ బంకింగ్పై వెంకీ మామ చేసిన ఈ సరదా కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

