Site icon NTV Telugu

Venkatesh : వెంకీ – త్రివిక్రమ్ సినిమాకి ముహూర్తం ఫిక్స్..!

Venkatesh Trivikram

Venkatesh Trivikram

టాలీవుడ్‌ క్లాసిక్ కాంబోగా పేరు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ .. మరోసారి స్క్రీన్‌పై మ్యాజిక్ రిపీట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన సినిమాలు ‘నువ్వునాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి టైమ్‌లెస్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి పని చేయబోతున్నారని చేస్తుండటంతో, ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read : Show Time Trailer : నవీన్ చంద్ర ‘షో టైమ్’ ట్రైలర్ రిలీజ్..

ఇక ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని అందుకొని వెంకీ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. దీంతో  ఆయన తర్వాత చేయబోయే సినిమా ఏంటని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇలాంటి టైంలో అనూహ్యంగా త్రివిక్రమ్-వెంకటేష్ కాంబో తెరపైకి వచ్చింది. త్రివిక్రమ్ నెక్స్ట్ రెండు సినిమాలు వెంకటేష్, ఎన్టీఆర్ తో ఉంటాయని ఇప్పటికే నిర్మాత నాగవంశీ కూడా తెలిపాగా ,అందుకు తగ్గట్టుగానే ముందుగా వెంకీ మామ మూవీ పట్టాలెక్కుతోంది. ఇక తాజా సమాచారం ప్రకారం..  వెంకీ–త్రివిక్రమ్ చిత్రం ఆగస్టు నెలలో ప్రారంభం కానుందట. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా. స్క్రిప్ట్ లాక్ అయి, లొకేషన్, టెక్నికల్ టీమ్, క్యాస్టింగ్ పనులు కూడా పూర్తి దశలో ఉన్నట్లు టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది.

Exit mobile version