NTV Telugu Site icon

Veekshanam :ఈ రేంజ్ సక్సెస్ చూసి చాలా సంతోషంగా ఉంది : డైరెక్టర్ మనోజ్

Veekshanam

Veekshanam

కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అని ఈ నెల 18న విడుదలైన మనోజ్ పల్లేటి దర్శకత్వం వహించి , రామ్ కార్తీక్, కశ్వి హీరో, హీరోయిన్‌లుగా నటించిన ‘వీక్షణం’ సినిమాతో మరోసారి రుజువైంది. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు మూవీ టీం థ్యాంక్స్ మీట్ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ మనోజ్ పల్లేటి మాట్లాడుతూ ‘చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ అవుతుందని తెలుసు, కానీ ఈ రేంజ్ సక్సెస్ చూసి చాలా సంతోషంగా ఉంది. మొన్న థర్స్డే ప్రీమియర్ షో దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇదే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్‌కి వచ్చి మూవీ చూసి మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ చాలా పెద్ద థ్యాంక్స్’ అని అన్నారు.

హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ ‘ముందుగా మా సినిమాను ఇంతలా జనాల్లోకి తీసుకువెళ్లిన మీడియా వాళ్లకు, సినిమాను చూసి ఆదరించిన ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా మంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. నేను కూడా నిన్న కొన్ని థియేటర్స్‌కి వెళ్లాను. అక్కడ అంతా చాలా పాజిటివ్‌గా ఉంది. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గొల్లపూడి మాట్లాడుతూ ‘అందరికి చాల పెద్ద థ్యాంక్స్. రివ్యూస్ కూడా చాల బాగా వచ్చాయి. చాల హ్యాపీగా ఉంది. సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు చాల చాల థ్యాంక్స్’ అని అన్నారు.

Show comments