NTV Telugu Site icon

VD : విజయ్ దేవరకొండ ‘రౌడీ వేర్’ బ్రాండ్ కు స్పెషల్ అవార్డ్

Rowdy

Rowdy

స్టార్ హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి విడుదల తర్వాత ఈ  సినిమాలోని నటనకు తన ఫ్యాన్స్ పెట్టుకున్న పేరుతో ‘రౌడీ వేర్’ అనే బ్రాండ్ పేరుతో క్లోతింగ్ బిజినెస్ స్టార్ట్ చేసాడు.  ‘రౌడీ బ్రాండ్’ అతి తక్కువ టీమ్ లో బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా యూత్ ఈ బ్రాండ్ అమితంగా కొనుగోలు చేసారు . అలా ఎంతో పాపులర్ అయిన ఈ రౌడీ బ్రాండ్ తాజగా మరో గౌరవాన్ని దక్కించుకుంది. యూత్ లో ఈ బ్రాండ్ కున్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. తాజాగా ఔట్ లుక్ ఇండియా నిర్వహించిన బిజినెస్ అవార్డ్స్ 2024లో ఐకానిక్ ఇండియన్ స్ట్రీట్ వేర్ బ్రాండ్ అవార్డ్ రౌడీ వేర్ బ్రాండ్ గెల్చుకుంది.

Also Read : Ram Talluri : ‘వికటకవి’ చూసి నాకు గర్వంగా అనిపించింది

ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. రౌడీ వేర్ ను ఐకానిక్ బ్రాండ్ గా మార్చిన రౌడీస్ తో పాటు తన రౌడీ వేర్ టీమ్ కు విజయ్ దేవరకొండ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఇలాగే సక్సెస్ ఫుల్ గౌ రౌడీ వేర్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. స్టైలింగ్, మేకోవర్ లో తనకున్న ప్యాషన్ తో రౌడీ వేర్ బ్రాండ్ ను విజయ్ ఎప్పటికప్పుడు సరికొత్తగా యూత్ కు రీచ్ చేస్తున్నారు.  విజయ్ దేవరకొండ తరుపున అయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఈ అవార్డ్ ప్రదానోత్సవంలో పాల్గొని నటి కీర్తి సురేష్ చేతుల మీదుగా అవార్డ్ స్వీకరించారు. రౌడీ  బ్రాండ్ ఈ అవార్డ్ గెలుచుకోవడంతో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు ఆయన ఫ్యాన్స్.

Show comments